ఆ లక్కీఛాన్స్ కీర్తి సురేష్‌కు…
అగ్రహీరో రజనీకాంత్‌తో ఒక్క సినిమాలోనైనా నటించాలని దక్షిణాదిలోకి కథానాయికలంతా కలలు కంటుంటారు. ఆ అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆ లక్కీఛాన్స్ కీర్తి సురేష్‌ను వరించింది. మహానటి తర్వాత వైవిధ్యతకు ప్రాముఖ్యతనిస్తూ సినిమాలు అంగీకరిస్తున్న ఆమె తాజాగా రాజనీకాంత్కు జోడీగా నటించనున్నది. వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్ కథానాయకుడి శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరక్కెనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ సంస్థ నిర్మించనున్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్ కథానాయికగా నటించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నా సినీ ప్రయాణంలో మ్యాజికల్ మైల్స్టోన్ ఇది. రజనీకాంత్‌తో కలిసి నటించనుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్లో మధురజ్ఞాపకంగా నిలిచిపోతుందనే నమ్మకముంది అని కీర్తిసురేష్ ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేసింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 168వ చిత్రమిది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.













