ఇకపై అలాంటి పాత్రలు చేయని కీర్తి
ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసుకునిపోయే హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది ఆమె నుంచి వచ్చిన సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ రోల్ చేసిన కీర్తి, ఆ సినిమా రీలీజ్ కు ముందు రోజు సాని కాయిదం అనే సినిమాలో రేప్ కు గురై ప్రతీకారం తీర్చుకునే వయలెంట్ రోల్ లో కనిపించింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లెవరూ ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి అంతగా ఇష్టపడరు. కానీ కీర్తి మాత్రం తను డిఫరెంట్ అని ప్రూవ్ చేసింది. పెంగ్విన్ లో ప్రెగ్నెంట్ గా కనిపించిన కీర్తి, మరక్కార్ సినిమాలో వేరే దేశస్తుడ్ని ప్రేమించే అమ్మాయిగా నటించి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసే హీరోయిన్ల లిస్ట్ లోకి చేరింది.
అంతేకాదు సీనియర్ హీరోల సరసన చెల్లి క్యారెక్టర్లకు కూడా ఓకే చెప్పి అన్నాత్తై, భోళా శంకర్ సినిమాల్లో నటించింది. రజనీ లాంటి హీరోకు చెల్లిగా నటించిన అన్నాత్తై సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టి రజినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక రీసెంట్గా వచ్చిన భోళా శంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భోళా శంకర్ కు ముందు తెగ ఎగ్జయిట్ అయిన కీర్తి ఈ సినిమా రిలీజ్ తర్వాత అసలేం మాట్లాడాలో తెలియని పరిస్థితికి వచ్చేసింది. స్టార్ హీరోలకు చెల్లిగా నటించిన సినిమాలు ఆమెకు మంచి మెమరీస్ గా ఉంటాయనుకుంటే ఆ రిజల్ట్ నిరాశపరిచే విధంగా ఉంది. దీంతో ఇకపై చెల్లి టైప్ క్యారెక్టర్లు చేయకూడదని కీర్తి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.













