విజయనిర్మల బయోపిక్‌లో కీర్తి ?
ప్రముఖ దర్శకురాలు, నటి దివంగత విజయనిర్మల బయోపిక్‌లో కీర్తి సురేష్ నటించబోతున్నట్లు తెలిసింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ చిత్రసీమపై చెరగని ముద్రవేశారు విజయనిర్మల. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. విజయనిర్మల జీవితకథను తెరకెక్కిచేందుకు ఆమె తనయుడు నరేష్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం ఆయన కీర్తి సురేష్‌ను సంప్రదించారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమచారం త్వరలో వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో రంగ్‌దే, మిస్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది కీర్తి సురేష్.













