కీర్తి ఆశలన్నీ దసరా మీదే!
మరో రెండు వారాల్లో రిలీజ్ కానున్న నాని లేటెస్ట్ మూవీ దసరా మీద భారీ అంచనాలున్నాయి. తన మొదటి ప్యాన్ ఇండియన్ సినిమా కావడంతో ప్రమోషన్స్ విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు నాని. అన్ని భాషల ప్రేక్షకులకు సినిమాను దగ్గర చేయాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరుగుతూ దసరాను ప్రమోట్ చేస్తున్నాడు.
మార్చి 30న రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో మంచి పోటీనే ఉంది. వాటిని దాటుకుని ఈ సినిమా నిలబడుతుందనే నమ్మకం ఆడియన్స్‌కి కలిగించాలంటే సినిఆమలో మంచి కంఎటంట్ ఉందనే విషయం జనంలోకి వెళ్లాలనే కారణంతో నాని అక్కడకి ఇక్కడికీ అని లేకుండా దేశమంతటా తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక అసలు విషయానికొస్తే, ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడీగా నటించనుంది. దసరా గురించి కీర్తి ఇప్పటివరకు ట్విట్టర్ లో తప్ప బయటకు వచ్చి ప్రమోట్ చేసింది లేదు. దానికి కారణం తను ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండటమే. ఓ వారంలో ఆ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, తర్వాత పది రోజులు దసరా ప్రమోషన్లలో నానితో కలిసి పాల్గొననుందట.
అయితే తాజా సమాచారం ప్రకారం, దసరాలో కీర్తిది చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చాడట దర్శకుడు. జాలీగా ఉండే నాని ప్రీ ఇంటర్వెల్ నుంచి అంత వైలెంట్ గా అవడానికి కారణమయ్యే కీలక సన్నివేశంలో నాని, కర్తి పెర్ఫామెన్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమంటున్నారు. చమ్కీల అంగీ సాంగ్ కూడా ఆన్ స్క్రీన్ సూపర్బ్ గా ఉంటుందని తెలుస్తోంది. రీసెంట్గా కీర్తి చేసిన చాలా సినిమాలు తనకు సరైన కిక్ ఇవ్వకపోవడంతో తన ఆశలన్నీ దసరా మీదే ఉన్నాయి.













