నా కలలన్నీ నెరవేరాకే దాని గురించి ఆలోచిస్తా
ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అద్భుతమైన చిత్రాలు, అత్యద్భుతమైన పాత్రలు మరిన్ని చేయాలని ఉంది. ఆ తర్వాతే పెళ్లి గురించి మాట్లాడతాను అని అంటోంది కీర్తి సురేష్. గతేడాది మహానటి తో అందరి దృష్టిని ఆకర్షించిన కీర్తికి ఈ చిత్రంతో మరింత పేరు, కీర్తి పెరిగింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు క్రేజీ కథానాయికగా మారిన కీర్తి తన సనీ ప్రయాణం గురించి చెబుతూ, నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. స్టడీస్ పూర్తయ్యాక మోడలింగ్ చేశా. అప్పుడే ఓ మలయాళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ సినిమా చేయలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను. నా సహచరులు, ఫ్రెండ్స్ సలహా మేరకు నటించా. ఆ సినిమా నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో వరుసగా తమిళం, అట్నుంచి తెలుగులో నటించే అవకాశాలు క్యూ కట్టాయి. తమిళంలో మంచి ప్రతిభావంతులున్నారు. నేను ప్రారంభం నుంచి బాగా శ్రమించినందు వల్లే ఈ స్థాయిలో ఉన్నా, ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నా. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మున్ముందు మరిన్ని భిన్నమైన పాత్రలు పోషించాలనుకుంటున్నా. నా కలలన్నీ నెరవేరాకే పెళ్లి గురించి ఆలోచిస్తా అని తెలిపింది.













