‘సాని కాయిదమ్’ కు గుమ్మడికాయ కొట్టారు
సాని కాయిదమ్ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టారు హీరోయిన్ కీర్తీ సురేష్. ఇందులో ప్రముఖ దర్శకులు సెల్వరాఘవ్ ఓ లీడ్ క్యారెక్టర్ చేశారు. ఇది సెల్వ రాఘవన్‌కు నటుడిగా తొలి చిత్రం కావడం విశేషం. అరుణ్ మాదేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకులు. ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. 1980 నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో విడుదల కానుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సాని కాయిదమ్ ఓ అద్భుతమైన జర్నీ. ఈ మంచి ప్రయాణంలో కొత్త విషయాలను నేర్చుకున్నాం అని సెల్వ రాఘవన్ పేర్కొన్నారు.













