రజనీకాంత్ సరసన కీర్తి సురేశ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, కీర్తి సురేశ్ జోడీగా త్వరలో ఓ సినిమా రాబోతుంది. అది పొలిటికల్ డ్రామాగా రూపొందనుంది. దానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళంలో రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉండొచ్చనని తెలిసింది. అందులో కీర్తిసురేశ్ మెయిన్ హీరోయిన్గా ఉండబోతుందట. ఈమెతో పాటు అనుష్క, హ్యుమా ఖురేషి, సిమ్రాన్, ఈశ్వరి తదితరులను కూడా సంప్రదిస్తున్నారు. వీరిలో ఎవరో ఒకరు కీలక పాత్ర చేయబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ప్రత్యేకత ఏమిటంటే రొమాంటిక్ సన్నివేశాలు, ఆ తరహా పాటలు ఉండకపోవడం.













