అదే మా బలం.. బలహీనత కూడా
కళాకారులు సున్నిత మనస్కులు. భావోద్వేగాల్ని ఆపుకోలేరు. నేను కూడా అంతే అంటోంది కీర్తి సురేష్. మహానటి తో తనలోని ప్రతిభని నూటికి నూరుశాతం వెండి తెరపై ఆవిష్కరించింది కీర్తి. అప్పటి నుంచీ ఆమెకు మరిన్ని అవకాశాలు వరుస కడుతున్నాయి. కార్తీ మాట్లాడుతూ మేమంతా ఎమోషన్ చుట్టూనే తిరుగుతుంటాం. అదే మా బలం. బలహీనత కూడా. నిజ జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతంగా ప్రతి స్పందించాల్సి వస్తుంటుంది. ఏ ఎమోషన్నీ ఎక్కువ సేపు దాచుకోలేను. ఇక తెరపై అంటారా పాత్రని బట్టి మారిపోవడం మా స్వభావం. ఒకొక్క సినిమాలో కథానాయిక పాత్ర ఒక్కోలా ఉంటుంది. అలాంటప్పుడు దానికి తగినట్టు మమ్మల్ని మేం సిద్దం చేసుకోవాల్సిందే. సమాజం లోని మనుషుల్ని, వాళ్ల స్వభావాల్నీ గమనించడమే మా హోమ్ వర్క్ అని చెప్పింది కీర్తి.













