ప్రతీసారీ ఆశించలేం…వాటిని సృష్టించలేం
కీర్తి సురేష్ పట్టిందల్లా బంగారమైపోతుంది. నేను శైలజ, నేను లోకల్ తో శుభారంభం చేసిన కీర్తి, మహానటితో స్టార్ అయిపోయిది. ఆ సినిమాతో కీర్తీ, కీర్తి మరింత ప్రకాశితమైంది. మీ నుంచి ఇక మీదటా ఇలాంటి మంచి చిత్రాలే ఆశిస్తారేమో అని అడిగితే, మహానటి గొప్ప చిత్రం. ఓ అద్భుతం. ప్రతీసారీ అద్బుతాలు ఆశించలేం. వాటిని సృష్టించలేం కూడా. అలా జరిగిపోతాయంతే. అయితే, ఇక మీదట పాత్రల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, మహానటి నాకు గుర్తు చేసుకుంటుంది. ఓ గొప్ప చిత్రం తరవాత ఏం చేసినా సహజంగా ఒత్తిడి ఉంటుంది. ఎలాంటి చిత్రాల్లో నటించాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలి? అనే గందరగోళం నెలకుంటుంది. దాన్ని సమర్థంగానే ఎదుర్కుంటాననే నమ్మకం ఉంది. నటన పరంగా, పాత్రల ఎంపిక పరంగా నా శైలి ప్రేక్షకులకు అర్థమయ్యే ఉంటుంది. అది నా పని కాస్త సులభంగా చేసిందని చెప్పింది కీర్తి సురేష్.













