కిర్తీకి మరో బంపర్ ఆఫర్!
మహానటి తర్వాత పలు భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటున్న కీర్తి సురేష్ తాజాగా మరో బంపర్ ఆఫర్ అందుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించే అరుదైన ఆఫర్ అమెని వరించిందట. ప్రస్తుతం మణిరత్నం మల్టీస్టారర్‌గా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో యువరాణి కుందవారు పాత్రలో కీర్తి నటించనున్నట్టు తెలుస్తోంది. కార్తీ జయంరవి, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో పాటు బాలీవుడ్లో రెండు సినిమాల్లో కీర్తి నటిస్తోంది. అలాగే మోహన్ లాల్ తో కలిసి మరక్కర్ అరబికడలించే సింహమ్ మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.













