కీర్తి సేఫ్ అయినట్లేనా..?
కీర్తి సురేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తీసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్స్ లో కీర్తి ఒకరు. మహా నటి తో కీర్తి కి బ్రహ్మరథం పట్టి, ఆమె కీర్తిని సరిహద్దులు దాటించారు. ఇంత తక్కువ అనుభవం కలిగిన అమ్మాయి సావిత్రిలా నటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. కీర్తిలో చాలా కంటెంట్ ఉందనే విషయం అందరికీ అర్థమైంది. దీంతో మహానటి తర్వాత ఈ అమ్మాయి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమా చేయలేదు. ఆ రేంజ్ హిట్ కూడా చేసింది లేదు. దీంతో కీర్తి ఫ్యాన్సంతా నిరాశ చెందారు.
కీర్తి తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ చేయడం, తెలుగులో ఆమె గ్రాఫ్ పెంచే సినిమాలు పడకపోవడం అభిమానులకు నిరాశే కలిగించింది. ఈ నేపథ్యంలో వచ్చిన మిస్ ఇండియా చూసి కుర్రాళ్లు చాలా ఢీలా పడ్డారు. ఇక ఇప్పుడు కీర్తి చేసిన గుడ్ లక్ సఖి పై ఇంతవరకూ బజ్ లేదు. మహేష్ బాబు సరసన ఆమె చేస్తున్న సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా టైమే ఉంది. ఈ మధ్యలో కీర్తికి ఒక హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకునే టైమ్ లో రంగ్ దే రిలీజై, సక్సెస్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లనే రాబడుతుంది. రంగ్ దే తో మంచి సక్సెస్, పేరు తెచ్చుకున్న కీర్తికి ఈ సినిమా సక్సెస్ తన పొజిషన్ కాపాడుకుని గండం నుంచి గట్టెక్కిందనే చెప్పాలి.













