ఆహాలోకి తరుణ్ భాస్కర్ బ్లాక్ బస్టర్ ‘కీడా కోలా’
విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన కీడా కోలా చిత్రం ఆహాలోకి రాబోతోంది. తెలుగులో వంద శాతం వినోదం ఇస్తున్న ఏకైక ఓటీటీ సంస్థలో కీడా కోలా చిత్రం డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
థియేటర్లో కీడా కోలా చిత్రం అందరినీ నవ్వించింది. క్రైమ్ కామెడీ జానర్లో కోడా కోలా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తరుణ్ భాస్కర్ స్టైల్ ఆఫ్ రైటింగ్, మేకింగ్ కీడా కోలా సినిమాను ప్రత్యేకంగా మార్చాయి. ఆయనలోని నటుడ్ని, మేకర్‌ను మళ్లీ ఆడియెన్స్ చూశారు.
ఆహా గోల్డ్ సభ్యులు 24 గంటల ముందే ఏ కంటెంట్‌నైనా చూడగలిగే ఓ ప్రత్యేకమైన ఆఫర్ ఉందన్న సంగతి తెలిసిందే. అయితే నాన్ గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ చిత్రం డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి రానుంది.
థియేటర్లో అందర్నీ నవ్వించిన ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. కామెడీ, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమాను ఆడియెన్స్ మిస్ అవ్వకుండా ఆహాలో చూడండి. వినోదాన్ని ఎంజాయ్ చేయండి.













