కేసీఆర్ బయోపిక్ లాంచ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ పేరుతో ఓ బయోపిక్, యాత్ర పేరుతో మరో బయోపిక్ త్వరలోనే ప్రేక్షకులని పలకరించనున్నాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమసారధి కేసీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కనుందని కొన్నాళ్ళుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది సేపటి క్రితం అన్నపూర్ణ స్టూడియోలో కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ గ్రాండ్‌గా లాంచ్ అయింది. అల్లూరి కృష్ణం రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, కల్వకుంట్ల నాగేశ్వరరావు మూవీని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేసీఆర్ పాత్రను ప్రముఖ నటుడు నాజర్ పోషించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.













