కావ్య ఆ లోటుని తీరుస్తుందా?
గత కొంతకాలంగా ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా రిజల్ట్ మంచి ఉపశమనాన్నిచ్చింది. ఆ సినిమా అంత పెద్ద హిట్టవడంలో హీరోయిన్ల గ్లామర్ ఎంతో ఉపయోగపడింది. నభా నటేష్, నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ లో చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో నభా ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఆ ఇద్దరు హీరోయిన్లలో ఎవరూ లేరు. దీంతో సీక్వెల్ లో ఫ్యాన్స్ ఆ ఇద్దరు హీరోయిన్లని మిస్ అవుతున్న మాట వాస్తవం. ఇప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ ఇద్దరు హీరోయిన్లు సినిమాలో లేని లోటుని కావ్య థాపర్ ఒక్కటే తీర్చేస్తుందనిపిస్తోంది.
ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజైన డ్యూయెట్ లో కావ్య అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో కూడా కావ్య సూపర్ సెక్సీగా కనిపించింది. ట్రైలర్ చివర్లో ఉన్న ఘాటు లిప్ లాక్ చూసి అందరూ షాకైపోయారు. అంతేకాదు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కూడా కావ్య ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. సినిమాలో ఇంతకుమించిన గ్లామర్ ఎటాక్ ఉంటుందని యూనిట్ సభ్యులంటున్నారు. మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ లో ఒక్క హీరోయినే డబుల్ గ్లామర్ ట్రీట్ ఇవ్వనుందన్నమాట.













