పి.టి.ఉష బయోపిక్ లో కత్రినాకైఫ్
ప్రమఖ అథ్లెట్ పి.టి.ఉష జీవిత కథతో ఓ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సీనియర్ నటి, దర్శకురాలు రేవతి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. గతంలో ఈ బయోపిక్‌ను ప్రియాంక చోప్రాతో తెరకెక్కించాలని ఈ దర్శకురాలు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు కత్రినాకైఫ్ తో ఈ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రేవతి ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు కత్రినకు కథ చెప్పారట. తాజాగా ఫైనల్ స్కిఫ్ట్ను కూడా వినిపించారట. స్కిప్ట్ బావుందని, ఈ సినిమా చేస్తానని కత్రినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. అయితే పి.టి.ఉషలా కత్రిన ఫిట్‌గా ఉంటుందా? అనేదే సందేహం. బబ్లీగా ఉండే ఈ బ్యూటీని అథ్లెట్ లుక్‌లో మారాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.













