కత్రినాకు అమెరికాలో అరుదైన గౌరవం
ఇప్పటికే లండన్‌లోని టుస్సాడ్ మ్యూజియంలో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ ముద్గుగుమ్మ కత్రినాకైఫ్ అమెరికాలోని మ్యూజియంలో కూడా ముద్దు లొలుకుతోంది. న్యూయార్క్‌లో గల టుస్సాడ్ మ్యూజియంలోనూ ఇటీవల కత్రినాకైఫ్ మైనపు ప్రతిమను ఆవిష్కరించారు. ఇందులో బాలీవుడ్ ఆల్ టైమ్ గ్రేట్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పక్కనే కత్రినాకు స్థానం కల్పించడం విశేషం. తెలుగు హీరోల్లో ప్రభాస్‌కు స్థానం దక్కిన ఈ మ్యూజియంలో ప్రపంచవ్యాప్తంగా పావులారిటీ కలిగిన ప్రసిద్ధ తారల మైనపు ప్రతిమలను ఏర్పాటు చేస్తుంటారు. నిజంగానే ఆయా తారలు అక్కడికి వచ్చి మ్యూజియంను చూస్తున్నారా అన్నంత సహజంగా వారి ప్రతిరూపాలు ఉంటాయి.













