వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిన కత్రినా కైఫ్
డెహ్రాడూన్ లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఒక సంపన్న కుటుంబంలో ఒక వివాహం తాజాగా జరిగింది. ఆ వివాహం కోసం వారు పెట్టిన ఖర్చు రూ.200 కోట్లు. ఆ వేడక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ అగ్రనటి కత్రినా కైఫ్ ను తమ వివాహ వేడుకలో డ్యాన్స్ చేయాలని కోరారు. భారీగా రెమ్యునరేషన్ ఇవ్వటంతో కత్రినా వచ్చేందుకు అంగీకరించారు. తాను నటించిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలోని ‘షీలా కీ జవానీ’ పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అబ్బురపరిచింది కత్రినా. ఎంతో సందడిగా జరిగిన ఈ పెళ్ళికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.













