కథనం ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దగ్గుబాటి రానా
అనసూయ, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కథనం. నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దగ్గబాటి రానా ఆవిష్కరించారు. ప్రస్తుతం కథనం చిత్రీకరణ జరుగుతోంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నారు. అనుసూయాలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారని రాజేష్ తెలిపారు. ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, ముక్తార్ ఖాన్, సమీర్, శేషు, అప్పారావు తదితరులు నటిస్తున్నారు. సంగీతం సునీల్ కశ్యప్, ఛాయగ్రహణం సతీష్ ముత్యాల.













