Bellamkonda Ganesh: కరుణాకరన్ తో బెల్లంకొండ గణేష్ మూవీ?

బెల్లంకొండ సురేష్(bellamkonda suresh) రెండో కొడుకుగా, సాయి శ్రీనివాస్(Sai Sreenivas Bellamkonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్ బాబు(bellamkonda ganesh babu) గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. స్వాతిముత్యం(Swathi mutyam) సినిమాతో అరంగేట్రం చేసిన గణేష్ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులేసుకున్నాడు. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు గణేష్.
స్వాతిముత్యం తర్వాత గణేష్, నేను స్టూడెంట్ సర్(nenu student sir) అనే మూవీ చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు గణేష్ నుంచి మరో సినిమా వచ్చింది లేదు. గణేష్ తన అన్నయ్య శ్రీనివాస్ లాగా సినిమాల విషయంలో జోష్ చూపించడం లేదు. సినిమా సినిమాకీ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్న గణేష్ తర్వాతి ప్రాజెక్టు విషయంలో శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం కిష్కింధపురి(kishkindhapuri) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న శ్రీనివాస్, తన తమ్ముడు చేయబోయే ప్రాజెక్టు గురించి మాట్లాడారు. గణేష్ నెక్ట్స్ ప్రాజెక్టు చాలా ఎగ్జైటింగ్ గా ఉండనుందని, రీసెంట్ గానే ఆ సినిమా ఓకే అయిందని, తాను లాంచ్ అవాలనుకున్న కరుణాకరన్(Karunakaran) దర్శకత్వంలో తన తమ్ముడు సినిమా చేయబోతున్నాడని, ఈ విషయం తనకెంతో ఆనందాన్నిస్తుందని, కొత్త నిర్మాతలు ఈ సినిమాను నిర్మించనున్నారని, ఆ మూవీకి భీమ్స్(Bheems) మ్యూజిక్ అందించనున్నాడని, త్వరలోనే అనౌన్స్‌మెంట్ వస్తుందని వెల్లడించాడు శ్రీనివాస్.