కార్తికేయ హీరోగా షూటింగ్ దశలో యువి క్రియేషన్స్ సినిమా
ప్రతిష్టాత్మక యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు.. సత్య జి ఎడిటర్. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.













