కార్తికేయ హీరోగా ‘చావు కబురు చల్లగా’ ప్రారంభం
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ మనవరాలు అన్విత క్లాప్‌నివ్వగా హీరో అల్లు అర్జున్ కుమారుడు అయాన్ కెమెరా స్విఛాన్ చేశారు. అల్లు అరవింద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తికేయ బస్తి బాలారాజు పాత్రలో కనిపించనున్నారు. రొటీన్ భిన్నంగా సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఈ నె 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. ఆమని, శ్రీకాంత్ అయ్యంగర్, మహేష్, భద్రం ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: సునీల్‌రెడ్డి, ఎడిటింగ్: సత్య, ప్రొడక్షన్ డిజైనర్: మనీషా ఏ దత్.













