దీపికాకు మద్దతుగా సినీ పెద్దలు
దీపికా నటించిన ఛపాక్ చిత్రం విడుదలకు తామ మద్దతిస్తామని విద్యార్థుల సంఘాలు బహిరంగంగానే ప్రకటించాయి. బాలీవుడ్ స్టార్స్, ఫిల్మ్‌మేకర్స్ నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సినిమాకు దీపిక నిర్మాత అన్న విషయం మరిచిపోకూడదు. భారీగా పెట్టుబడులు పెట్టింది. దీపికాకు మద్దతుగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు అనురాగ్ కశ్వప్. దీపికా చేసిన పని గర్వంగా ఉందని నటుడు విక్రాంత్ మెస్సే పేర్కొన్నారు. నిర్మాతగా ఈ రోజు ముంబాయిలోని ప్రీవ్యూ థియేటర్లో నిలబడి ప్రశంసలు అందుకోవాల్సింది పోయి జెఎన్‌యు విద్యార్థులకు మద్దతుగా నిలవడం చాలా గౌరవంగా అనిపించింది అని నిఖిల్ అద్వాని తెలిపారు. దీపికా నువ్వు నిజమైన భారతీయురాలిగా నిరూపించుకున్నావ్ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.













