Karthik Aaryan-Sree leela: బీ టౌన్ హాట్ టాపిక్ గా కార్తీక్, శ్రీలీల కెమిస్ట్రీ
రాబిన్హుడ్(Robinhood) సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన శ్రీలీల(Sree leela) ఆ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న శ్రీలీల బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే.
అనురాగ్ బసు(Anurag Basu) దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా నుంచి మేకర్స్ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. కానీ గ్లింప్స్ చూశాక అందరూ ఈ సినిమా ఆషికి3(Aashiqui3) అంటున్నారు. ఇదిలా ఉంటే శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్ల నుంచి నెట్టింట వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే వీరిద్దరూ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్ లో వర్కవుట్ అయిందని, వీరి జంట చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. వారి మాటలకు తగ్గట్టే రీసెంట్ గా సెట్స్ నుంచి లీకైన ఫోటోలు చూస్తుంటే అర్థమవుతుంది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటి అంటే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఉన్న బాండింగే.













