రోజుకి రెండు కోట్లు డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ యంగ్ హీరో…
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయిన హీరోల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలు చేసినా, తర్వాత తర్వాత పెద్ద సినిమాల్లో హీరోగా నటించాడు కార్తీక్. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే కరణ్ జోహార్ ఈ యంగ్ హీరో ని ఒక ప్రాజెక్ట్ నుండి తప్పించడంతో, ఇక ఈ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారంతా.
ఇలాంటి సమయంలోనే “భూల్ భూలయియా 2” తో సూపర్ హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరుస డిజాస్టర్లతో ఒకవైపు బాలీవుడ్ డీలా పడుతున్న టైం లో కార్తీక్ ఆర్యన్ నటించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ విజయంతో బాలీవుడ్ కి కాస్త ఉపశమనం లభించిందనే చెప్పాలి. ఇక హీరో విషయానికి వస్తే, ఈ ఒక్క సినిమాతో అతడి రేంజ్ మారిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. భూల్ భూలయియా 2 తో హీరో కార్తీక్ ఆర్యన్ డిమాండ్ అమాంతం పెరిగింది. మీడియం రేంజ్ హీరోగా పైకి వచ్చిన ఆర్యన్, రీసెంట్ గా సైన్ చేసిన ఒక సినిమాకు రోజుకు రెండు కోట్ల చొప్పున పారితోషకం అందుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ యంగ్ హీరో స్పందించాడు. తానే స్వయంగా రోజుకి రెండు కోట్లు పారితోషికం తీసుకున్నట్లు వెల్లడించడం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “నేను కరోనా టైంలో ఒక సినిమా చేశాను. ఆ సినిమాలో నా పాత్ర చిత్రీకరణ 10 రోజుల్లోనే పూర్తయింది. తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు రెట్టింపు లాభం దక్కింది. అందుకే నాకు ఆ పారితోషకం దక్కింది. అందుకు నేను అర్హుడినే అనుకుంటున్నా” అని కార్తీక్ క్లారిటీ ఇచ్చాడు.













