Karthikeya: దోమలపై కార్తికేయ సెటైరికల్ వీడియో
దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) ఏ విషయాన్ని అయినా చాలా డిఫరెంట్ గా చెప్తారు. దేన్నైనా స్పెషల్ గా ప్రెజెంట్ చేయడంలో రాజమౌళి నిపుణుడు. తండ్రి లాగానే రాజమౌళి కొడుకు కార్తికేయ(karthikeya) కూడా సంథింగ్ స్పెషల్ గానే థింక్ చేస్తున్నాడు. రీసెంట్ గా కార్తికేయ తన సోషల్ మీడియాలో ఓ క్రియేటివిటీ వీడియోను షేర్ చేయగా అది నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే కార్తికేయ షేర్ చేసిన వీడియో ఏ సినిమాదో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఆయన షేర్ చేసింది ఒక దోమల వీడియో. హైదరాబాద్ లో రీసెంట్ గా దోమల బెడద బాగా ఎక్కువైపోయింది. దీంతో ప్రజలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని కార్తికేయ కాస్త సెటైరికల్ గా వీడియో ద్వారా షూట్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం కార్తికేయ ఓ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండగా, అర్థరాత్రి జరుగుతున్న షూటింగ్ లో ఈ దోమలు తమ మూవీ యూనిట్ ను ఎంతలా ఇబ్బంది పెడుతున్నాయో చెప్తూ ఆ వీడియోను పోస్ట్ చేశాడు. కార్తికేయ షూట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఈ వీడియోను ప్రభుత్వానికి, మున్సిపల్ ఆఫీసర్లకు ట్యాగ్ చేసి షేర్ చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2020007054522650795?s=20













