Mega157: మెగా157లో విలన్ గా టాలీవుడ్ హీరో?
సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మెగా157(mega157) టైటిల్ తో రానున్న ఈ మూవీ రీసెంట్ గా ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి చాలా కాలం తర్వాత కామిక్ రోల్ లో కనిపించబోతున్నాడు.
అయితే అనిల్ రావిపూడి సినిమాలంటే అందులో అన్నీ యాంగిల్స్ ఉంటాయి. కామెడీ, రొమాన్స్, యాక్షన్ అన్నింటికీ ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో అనిల్- చిరూ సినిమాలో విలన్ రోల్ ఎవరు చేస్తున్నారనే విషయంలో టాలీవుడ్ లోని యంగ్ హీరో పేరు వినిపిస్తుంది. అతను మరెవరో కాదు. ఆర్ఎక్స్100(RX100) హీరో కార్తికేయ గుమ్మడికొండ(Karthikeya Gummadikonda).
చిరంజీవితో పోటీ పడే పాత్రలో మెగా157లో కార్తికేయ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమాలో విలన్ పాత్ర కూడా కామెడీగానే ఉంటుందట. ఈ విషయం నిజమైతే మాత్రం కార్తికేయ కోరిక తీరినట్టే. ఎందుకంటే కార్తికేయ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్. చిరంజీవిని చూసే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలున్నాయి. అలాంటి ఆయన సినిమాలో విలన్ గా నటించే అవకాశమంటే కార్తికేయకు ఇంకేం కావాలి.






