క్రియేటివ్ బ్యానర్ లో బస్తీ బాలరాజు సినిమా…
క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ ప్రొడక్షన్ సుకుమార్ రైటింగ్స్ లో ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరో గా ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ ఈ రోజు అధికారిక ప్రకటన వచ్చేసింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై కార్తికేయ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి సుక్కు నిర్మాతగా వ్వహరించడమే కాకుండా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇటీవలే ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఈ బ్యానర్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఇప్పుడు జీఏ2 పిక్చర్స్ తో కలిసి 18 పేజెస్ అనే సినిమా కూడా సుకుమార్ రైటింగ్స్ నుంచి రానుంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతే కాదు మెగాహీరో సాయి తేజ్ హీరోగా శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో కలిసి ఒక మిస్టికల్ థ్రిల్లర్ ని కూడా సుకుమార్ రూపొందిస్తున్నాడు. ఇప్పుడు చావు కబురు చల్లగా సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్న కార్తికేయతో మరో సినిమా అనౌన్స్ చేశాడు. ఒక వైపు సుకుమార్ భారీ బడ్జెట్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు నిర్మాతగా న్యూ టాలెంట్ ను యంకరేజ్ చేస్తున్నాడు.













