వెంకీ ఆ రిస్క్ చేస్తాడా?
ఏ హీరో అయినా సరే డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాదని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా దానికి భారీ నష్టం జరుగుతుంది. నిర్మాతకు డబ్బులు పరంగా, హీరోకు కెరీర్ పరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ఎక్కువగా నష్టపోయిందంటే బాలకృష్ణనే. తర్వాత్తర్వాత మూస డైరెక్టర్లకు గుడ్ బై చెప్పి, కొత్త జనరేషన్‌కు ఓటేస్తున్నాడు బాలయ్య.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా సినిమాల విషయంలో పరిగెత్తకుండా స్క్రిప్ట్ పక్కాగా నచ్చితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి, శైలేష్ కొలను లాంటి చాలా తక్కువ మంది మాత్రమే వెంకీని ఒప్పించగలిగారు. తరుణ్ భాస్కర్, అనుదీప్ లాంటి వాళ్లు వెంకీ కోసం చాలా కాలంగా క్యూ లో ఉన్నారు.
రీసెంట్గా జరిగిన జిగర్తండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన వెంకీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా తన కోసం కార్తీక్ ఓ స్టోరీని రెడీ చేస్తున్నట్లు కూడా సిగ్నల్ ఇచ్చాడు. వెంకీ మాటలను బట్టి చూస్తుంటే కార్తీక్‌తో సినిమా చేయడానికి ఇష్టంగానే కనిపిస్తున్నాడు. కానీ కార్తీక్ శైలి చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
అలాంటి కార్తీక్ సుబ్బరాజ్ వెంకీ కోసం, టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్లు స్క్రిప్ట్ ను రెడీ చేయడమంటే మాటలు కాదు. పైగా కార్తీక్ సుబ్బరాజ్ ఎవరి మాటా వినడనే పేరు చాలా బాగా ఉంది. కమర్షియల్ లేదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసే వెంకీ, కార్తీక్ సుబ్బరాజ్ రూట్లోకి వెళ్తాడా? వెళ్లి సక్సెస్ అవుతాడా అని కొందరంటుంటే, అనవసరంగా కొత్త ప్రయోగాలు చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని మరికొందరంటున్నారు.













