నానితో ఆ డైరెక్టర్… వర్కవుట్ అవుతుందా?
హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నానికి కోలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం దసరాతో ఊర మాస్ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న నాని, ఇప్పుడు హాయ్ నాన్నతో మరో హిట్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా సరే నానితో సినిమా చేయాలని కోలీవుడ్ డైరెక్టర్లు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
శిబి చక్రవర్తితో నాని సినిమా ఆల్మోస్ట్ ఓకే అనుకున్నారు. శివ కార్తికేయన్ తో డాన్ మూవీ చేసిన శిబి చక్రవర్తి, నానికి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. కానీ బడ్జెట్ ఏకంగా వంద కోట్లు అనేసరికి నిర్మాతలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఇప్పుడు శిబి ప్లేస్ లోకి కార్తీక్ సుబ్బరాజ్ చేరినట్లు సమాచారం.
ఇప్పటికే కార్తీక్, నాని కోసం ఓ స్టోరీని రెడీ చేశాడని టాక్. అయితే కార్తీక్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ఆడియన్స్ కు అంత ఈజీగా ఎక్కదు. జిగర్తండ డబుల్ ఎక్స్ తమిళంలో సూపర్ హిట్ అయింది కానీ మన దగ్గర డిజాస్టర్‌గా మిగిలింది. పైగా కార్తీక్ ఎవరి మాటా వినడు. తను అనుకున్నదే తీస్తాడు తప్పించి అస్సలు మార్చే ప్రయత్నం చేయడు. మరి ఇలాంటి డైరెక్టర్ తో నాని సినిమా వర్కవుట్ అవడం అంత సులభమేమీ కాదు. ప్రస్తుతం హాయ్ నాన్న సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాని, వివేక్ ఆత్రేయ తో సరిపోదా శనివారం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.













