‘దేవ్’ షూటింగ్ పూర్తి
కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవ్. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. రజిత్ రవిశంకర్ దర్శకుడు. లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. జనవరిలో పాటల్ని, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. ఖాకి లో కార్తి, రకుల్ జంట ఆకట్టుకుంది. ఈసారి వీరిద్దరి మధ్య నడిచే ప్రేమకథ కొత్తగా ఉండబోతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, ముంబయిల్లో చిత్రీకరణ జరిపాం. హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించామన్నారు. సంగీతం: హారీశ్ జయరాజ్.













