Karthi: తెలుగుదనం ఉట్టిపడే టైటిల్ తో రానున్న కార్తీ
ఈ మధ్య తమిళ డబ్బింగ్ సినిమాలను అదే టైటిల్ తో తెలుగులోనూ రిలీజ్ చేయడం చాలా కామన్ గా మారిపోయింది. ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ నుంచి పలుసార్లు వ్యతిరేకత ఎదురైనా, డిస్ట్రిబ్యూటర్లు ఎంత అడుగుతున్నా కోలీవుడ్ నిర్మాతలు పట్టించుకున్న పాపాన పోలేదు. రజినీకాంత్(rajinikanth) వేట్టయాన్(vettayan) నుంచి విజయ్ ఆంటోనీ(vijay anthony) మార్గన్(margan) వరకు ఇలా ఎన్నో సినిమాలు అదే తరహాలో రిలీజయ్యాయి.
కానీ కార్తీ(karthi) మాత్రం ఆ తప్పు చేయడం లేదు. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న కార్తీకి తెలుగు ఆడియన్స్ అన్నా, తెలుగు భాషన్నా ఎంతో గౌరవం. అందుకే తన సినిమాలకు తెలుగులో తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇప్పుడు మరోసారి కార్తీ టాలీవుడ్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.
నలన్ కుమారస్వామి(nalan kumaraswamy) దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన వా వాతియార్(Vaa Vaathiyar) సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుండగా ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో కాకుండా అన్నగారు వస్తారు(anna garu vastharu) అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగుదనం ఉట్టిపడే మంచి టైటిల్ ను ఎంచుకున్నందుకు ఈ విషయంలో తెలుగు ఆడియన్స్ కార్తీని ప్రశంసిస్తుండగా, ఈ మూవీలో కార్తీ సరసన కృతి శెట్టి(Krithi shetty) హీరోయిన్ గా నటిస్తుంది.






