నిజ జీవిత దొంగ స్టోరీతో కార్తి సినిమా
తమిళ హీరో కార్తి చేసే సినిమాలు ఒకదాంతో ఒకటికి సంబంధమే ఉండవు. కొత్త కొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, డిఫరెంట్ ప్రయోగాలు చేసే హీరోగా కార్తికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం కార్తి జపాన్ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన జపాన్ టీజర్ సరికొత్తగా, ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉంది.
టీజర్ చూస్తుంటే కార్తి అకౌంట్ లో మరో హిట్ ఖాయమనే అనిపిస్తుంది. రాజా మురుగున్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలను పెంచింది. రాజా మురుగున్ గతంలో మండేలా అనే డిఫరెంట్ మూవీ తీసి ప్రేక్షకులతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఈ సినిమా ఒక నిజ జీవిత దొంగ కథ ఆధారంగా తెరకెక్కుతోందట. తమిళనాట బాగా ఫేమస్ అయిన మురుగన్ జీవిత కథనే జపాన్ అనే సినిమాగా తీస్తున్నాడట రాజా మురుగన్. 2009లో మురుగన్ లలిత జువెలర్స్ లో భారీ దొంగతనం చేసి పోలీసులకు దొరికిపోయాడు.
బంగారు షాపుల్లో దొంగతనం చేయడంలో మురుగన్ ఎంతో నేర్పరి. మురుగన్ స్టోరీలో ఎన్నో ఇంట్రస్టింగ్ మలుపులు ఉండటంతో దానికి కొంత భాగం ఫిక్షన్ జోడించి రాజా మురుగన్ కార్తి క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు సమాచారం. నిజ జీవిత కథలకు ఫిక్షన్ జోడించడంలో తమిళ డైరెక్టర్లకు చాలా టాలెంట్ ఉంది. మరి ఈ సినిమాను రాజా మురుగన్ ఎలా తెరకెక్కించి ఇంప్రెస్ చేస్తాడో చూడాలి.













