పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కార్తీ సినిమా
కార్తీ(Karthi), అరవింద్ స్వామి(Aravind Swamy) ప్రధాన పాత్రల్లో 96 ఫేమ్ ప్రేమ్ కుమార్(Prem Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన మేయలగన్(Meiyazhagan). ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం(Satyam Sundaram) పేరుతో రిలీజ్ అవుతుంది. రేపు రిలీజ్ కానున్న మేయగలన్ సినిమాకు కోలీవుడ్(Kollywood) లో స్పెషల్ ప్రీమియర్లు వేయగా సినిమాకు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చింది. టీజర్, ట్రైలర్ తోనే మేయలగన్ సంథింగ్ స్పెషల్ అనిపించింది.
బావ, బామ్మర్ది మధ్య జరిగే కథగా ఈ సినిమా రూపొందింది. వారి మధ్య ప్రేమ, అనుబంధం చుట్టూనే ఈ కథంతా తిరుగుతుంది. మేయలగన్ ప్రీమియర్ చూసిన వారంతా ఇది తప్పక చూడాల్సిన చిత్రంగా చెప్తున్నారు. కథ, కథనం, ఎమోషన్స్ విషయంలో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మరోసారి తన మార్క్ చూపించి అదరగొట్టాడని చెప్తున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ తమ చిన్నతనానికి తీసుకెళ్లేలా ఉందని మూవీ చూసిన వారు అంటున్నారు.
తమిళ సంప్రదాయాలను మేయలగన్ లో చాలా బాగా చూపించారని, సినిమాల్లో జల్లికట్టు(Jallikattu)కి సంబంధించిన సీన్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయంటున్నారు. తమిళంలో రేపు రిలీజవుతున్న మేయలగన్, తెలుగులో మాత్రం ఒక రోజు ఆలస్యంగా రిలీజవుతుంది. దేవర(Devara) తో పోటీ పడకుండా ఒకరోజు లేట్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి తమిళ నేటివిటీ ఎక్కువగా ఉన్న సత్యం సుందరంను ఆడియన్స్ ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.













