కంగువలో కార్తీ.. ఏ పాత్రలో కనిపిస్తాడంటే
సూర్య నటించిన కంగువ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు నెలలకు పైగానే టైముంది. ఈ సినిమాపై అందరికీ ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. రెండేళ్లకు పైగా టైమ్ తీసుకుని సూర్య చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంద. ఇందులో సూర్య రెండు కాలాలకు సంబంధించిన వీరుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే కంగువ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్లుంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య, కార్తీ ఒకే ఫ్రేమ్ లో కనిపించనున్నారని, ఆ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని కోలీవుడ్ మీడియా వర్గాలంటున్నాయి. క్లైమాక్స్ లో కార్తీ ఎంట్రీ ఉంటుందని, పార్ట్ 2కి లీడ్ ఇచ్చే కీలక ట్విస్ట్ తన పాత్ర చుట్టూనే ఉంటుందని తెలుస్తోంది..
మరి కార్తీ కంగువలో కాష్మోరాగా కనిపిస్తాడా లేదా ఖైదీలో ఢిల్లీగా కనిపిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. ఇందులో సూర్య రోలెక్స్ గా కనిపిస్తాడని కూడా అంటున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీని ఎంతైనా తీసుకోవచ్చు. సూర్య, కార్తీ పాత్రలను డైరెక్టర్ శివ ఎంతో స్పెషల్ గా డిజైన్ చేసినట్లు అంతర్గత సమాచారం.













