Hit4: హిట్4 తో హిట్వర్స్ రేంజ్ మరింత పెరగడం ఖాయం
హిట్(Hit) ఫ్రాంచైజ్ సినిమాల్లో భాగంగా నిన్న రిలీజైన హిట్3(Hit3) సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆల్రెడీ హిట్3కు మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. ఇదిలా ఉంటే హిట్3 రిలీజైన దగ్గర నుంచి హిట్వర్స్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
అదే హిట్4(Hit4). నాని(Nani) నటించిన హిట్3 క్లైమాక్స్ లో హిట్4లో ఏ హీరో నటించనున్నాడనేది క్లూ ఇచ్చారు. హిట్4 లో కోలీవుడ్ హీరో కార్తీ(Karthi) నటించనున్నాడు. కార్తీకి తమిళంతో పాటూ తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండటంతో హిట్4 కోసం హీరోగా కార్తీని సెలెక్ట్ చేసుకోవడమనేది నిర్మాతగా నానిది తెలివైన ప్లానే. కార్తీ వల్ల హిట్వర్స్ రేంజ్ మరింత పెరగడంతో పాటూ హిట్4 కు తమిళనాడు లో కూడా మంచి డిమాండ్ ఏర్పడటం ఖాయం.
అయితే హిట్3 లో కార్తీ ఉన్నాడనే వార్తలు ముందు నుంచే సోషల్ మీడియాలో వినిపించాయి. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కార్తీ షూటింగ్ లో కూడా పాల్గొన్నాడని వార్తలొచ్చాయి. కానీ అప్పుడు వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు హిట్3 రిలీజయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయని అందరూ అనుకుంటున్నారు. మొత్తానికి హిట్4 పై అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ఏర్పడింది.






