వాలెంటైన్స్ డే కానుక దేవ్
ఖాకి కోసం తొలిసారి జంటగా నటించారు కార్తి, రకుల్‌ప్రీత్ సింగ్. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి జోడీ కట్టారు. వీర్దిద్దరూ కలిసి నటించిన చిత్రం దేవ్. నిక్కీ గల్రాని, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులు. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. ఎస్.లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ నెల 14న పాటల్ని విడుదల చేస్తారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. కుటుంబ అనుబంధాలకూ స్థానం ఉంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. కార్తి, రకుల్ జంట మరోసారి ఆకట్టుకుంటుంద న్నారు. సంగీతం: హరీష్ జయరాజ్.













