Yuganiki Okkadu: యుగానికి ఒక్కడు గురించి చాలా మందికి తెలియని విషయాలు

కార్తీ(Karthi) హీరోగా నటించిన యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) సినిమా 2010లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులో కార్తీకి మంచి ఫాలోయింగ్ రావడానికి ఈ సినిమానే కారణం. మార్చి 14న యుగానికి ఒక్కడు మూవీ రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
ఈ మూవీ షూటింగ్ 2007లో మొదలైనప్పటికీ రిలీజైంది మాత్రం 2010లో. అంటే అప్పట్లోనే ఈ సినిమా మూడేళ్లు షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీ కోసం హీరోయిన్లు రీమా సేన్(Rimasen), ఆండ్రియా(Andrea) కాల్షీట్స్ ముందుగా 45-60 రోజులు మాత్రమే తీసుకున్నారట. కానీ తర్వాత దాన్ని మూడేళ్ల పాటూ పెంచుకుంటూ వెళ్లారట. మూవీ షూటింగ్ మొత్తం 260 రోజులు జరిగితే, పోస్ట ప్రొడక్షన్ వర్క్ మాత్రమే ఏడెనిమిది నెలలు జరిగిందట.
కోవిడ్ తర్వాత ఈ మూవీకి తమిళ్ లో అన్ కట్ వెర్షన్ ను రిలీజ్ చేయగా, దానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ కట్ వెర్షన్ లో చోళ రాజు, అనిత పాత్రకు ఓ పాట, ఫైట్ సీన్ తో పాటూ కొన్ని ఆసక్తికర సన్నివేశాల్ని కూడా యాడ్ చేశారు. ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే గుహ సీన్ ను రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేశారట.