సీఎం భార్య నటిస్తుందా?
ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి గతంలో టాలీవుడ్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత రాధిక కుటుంబానికే పరిమితమై వెండితెరకు దూరమైంది. ఇప్పుడు తాజాగా ఓ తెలుగు సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు రాధిక సిద్దమయ్యారని తెలుస్తోంది. యాక్షన్కింగ్ అర్జున్ హీరోగా చేస్తున్న సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం రాధికను సంప్రదించారట. కథ నచ్చడంతో రాధిక కూడా ఓకే అన్నారట. కాకపోతే ఇదంతా కుమారస్వామి ముఖ్యమంత్రి కాకముందు జరిగిన విషయం అంటున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక రాధిక సినిమాల్లో చేయకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. తన తెలుగు సినిమా ఒప్పుకున్నట్టుగానీ, చేయట్లేదని కానీ రాధిక ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు.













