కరోనా సంక్షోభ వేళ…భారత దేశ సంప్రదాయాలను తెలిపిన కర్మభూమి
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ప్రాచీనులు పాటించిన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను నేటి మనుష్యులు హేళనచేసి భ్రష్టు పట్టించారు. ఇలాంటి సమయంలో కరోనా వ్యాధి చైనా నుంచి మనదేశానికి కూడా వ్యాపించింది. కరోనా వంటి ఎన్నో మహమ్మారులను అరికట్టడానికి మన మహర్షులు ఎన్నో విషయాలను వేదాల్లో సంక్షిప్తం చేశారు. అలాంటి వేదాల్లో ఉన్న మన్యుసూక్తంను పఠిస్తే మనం ఈ కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడవచ్చు. భారతదేశం కర్మభూమి. ఇక్కడ ఎలాంటి దుష్టశక్తులు ఎల్లకాలం ఆటలు సాగించలేవు వంటి విషయాలను తెలియజేసేలా కర్మభూమి షార్ట్ ఫిలింను ఐ డ్రీమ్ మూవీస్ రిలీజ్ చేసింది. ఇందులో సాయి కుమార్, రఘు కారుమంచి నటించారు. భారత దేశ ఔన్నత్యాన్ని తెలియజేసే ఈ వీడియోను మీరు తిలకించండి.













