Raja Saab: ప్రభాస్ తో కాలు కదపనున్న బాలీవుడ్ స్టార్ భామ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ది రాజా సాబ్(The Raja Saab). మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా ఇప్పుడు ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. రాజా సాబ్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజయ్యాక ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
శరవేగంగా జరుగుతున్న రాజా సాబ్ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని, కేవలం ఓ సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఆ బ్యాలెన్స్ ఉన్న సాంగ్ ఓ స్పెషల్ సాంగ్ అని సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో ఏ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా తాజాగా ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్(Kareena Kapoor) ను తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎలాగైనా ఈ సాంగ్ ను కరీనాతోనే చేయించాలని, అవసరమైతే ఆమెకు భారీ పారితోషికమైనా ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మరి రాజా సాబ్ స్పెషల్ సాంగ్ కు కరీనా కపూర్ ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. నిధి అగర్వాల్(Niddhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.