సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కపటనాటక సూత్రధారి
విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందూలాల్, అమీక్ష, సునీత తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కపటనాటక సూత్రధారి. క్రాంతి సైన దర్శకుడు. మనీష్ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఓ విభిన్నమైన థ్రిల్లర్ చిత్రమిది. క్రాంతి అద్భుతంగా తెరకెక్కించారు. సుభాష్ విజువల్స్, రామ్ సంగీతం, వికాస్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఈ సినిమాకి సంగీతం: రామ్ తవ్వ, కూర్పు : ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సుభాష్ దొంతి.













