సైలెంట్ అయిన కన్నప్ప.. రీజనేంటి?
మంచు ఫ్యామిలీకి ముఖ్యంగా మంచు విష్ణు(Manchu Vishnu)కు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న సినిమా కన్నప్ప(Kannappa). ఈ సినిమా గురించి విష్ణు ఎంతో కాలంగా చెప్తూ వచ్చాడు. ఆఖరికి గతేడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కన్నప్ప తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని విష్ణు ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
జూన్ 14న టీజర్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ప్రతి సోమవారం పోస్టర్లు రిలీజ్ చేస్తూ కన్నప్పను వార్తల్లో నిలపాలని బాగానే ట్రై చేశారు. కానీ ఈ మధ్య కన్నప్ప యూనిట్ సైలైంట్ అయిపోయింది. ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చి నెల దాటిపోయింది.
కన్నప్పను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని విష్ణు గతంలో చెప్పాడు. దాని ప్రకారమే ప్రమోషన్స్ కూడా చేస్తూ వచ్చారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచకుండా సైలెంట్ అయింది. మరి రిలీజ్ డేట్ టార్గెట్ ను అందుకోవాలనే లక్ష్యంతో షూటింగ్ పై ఫోకస్ పెట్టారా లేక డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనను మానుకుని సైలెంట్ అయ్యారా అనేది అర్థం కావడం లేదు. డిసెంబర్ లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కన్నప్ప యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో త్వరగా ఏదొక నిర్ణయం తీసుకోవడం బెటర్.













