ఆ విషయంలో కన్నప్పకు ముందుచూపు అవసరమే
మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప పై అందరికీ భారీ అంచానలున్నాయి. రీసెంట్ గా రిలీజైన టీజర్ లో విజువల్స్ చాలా బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మిక్డ్స్ రెస్పాన్స్ వస్తోంది. క్యాస్టింగ్ ను రివీల్ చేయకుండా కేవలం హీరోను మాత్రమే హైలైట్ చేయడం వల్ల కొంత ట్రోలింగ్ తప్పలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కన్నప్పలో భారీ క్యాస్టింగ్ ఉండటం వల్ల సోలో రిలీజ్ ను ఎంచుకోవడమే ఉత్తమం. చిత్ర యూనిట్ కన్నప్పను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే డిసెంబర్ 6వ తేదీకి పుష్ప2 లాక్ అయింది. 20వ తేదీ తండేల్, రాబిన్ హుడ్ సినిమాలు వస్తున్నాయి. ఒకవేళ కన్నప్ప నిజంగా డిసెంబర్ ను టార్గెట్ చేస్తే మాత్రం వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలి. అప్పుడే కన్నప్ప పోటీ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. మరి కన్నప్పను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.













