Kannappa: కన్నప్ప సినిమా చేయడం నా కల – న్యూ జెర్సీ లో మంచు విష్ణు

అత్యంత ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు భారీ తారాగణంతో నిర్మిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న సందర్భంగా ఆ సినిమా యూనిట్ అమెరికాలో ముఖ్య నగరాల్లో ప్రమోషనల్ టూర్ జరుపుతున్నారు. అందులో భాగంగానే 8 మే 2025 తేదీ న న్యూ జెర్సీ లో రీగల్ సినిమా కాంప్లెక్స్ లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా కన్నప్ప (Kannappa) సినిమా కి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ Ms ఐశ్వర్య, సీఈఓ – వసారా ఎంటర్టైన్మెంట్ , హీరో మంచు విష్ణు (Manchu Vishnu)ని రీగల్ సినిమా కాంప్లెక్స్ లోకి స్వాగత పూర్వకంగా తీసుకు వచ్చారు. రుద్ర డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 20 మంది అమ్మాయిలు – అబ్బాయిలు కన్నప్ప సినిమా లోని శివ శివ శంకరా పాట కి అద్భుతమైన డాన్స్ తో స్వాగతం పలికారు.
థియేటర్ లో కన్నప్ప సినిమా కు సంబంధించిన కొన్ని ప్రోమో లను బిగ్ స్క్రీన్ మీద చూసిన అతిథులందరూ సినిమా టేకింగ్ మీద, గ్రాండియర్ మీద, అద్భుతమైన లొకేల్స్ మీద ప్రశంసలు ఇచ్చారు. తరువాత హీరో మంచు విష్ణు అనేక ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సినిమా గురించిన అనేక విషయాలు తెలిపారు.
మంచు విష్ణు చెప్పిన కొన్ని వివరాలు…
కన్నప్ప సినిమా తీయడం ఒక కల. ఈ కోరిక నాకు ఎప్పటి నుంచో వుంది. ఇప్పుడు శివుని ఆజ్ఞ తో ఆ కోరిక నెరవేరింది.
కన్నప్ప మీద చాలా సినిమాలు వచ్చాయి. చివరగా సీనియర్ నటులు కృష్ణం రాజు గారు నటించిన భక్త కన్నప్ప అందరిని అలరించింది. నేను కూడా ఇప్పటి తరానికి ఈ కథను చూపించాలని అనుకొన్నాను.
సినిమా చాల వరకు న్యూజిలాండ్ లో తీసాము. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో న్యూజిలాండ్ ఇంకా పూర్తి స్థాయి నేచర్ తో వున్న దేశం. అందుకే ఎప్పుడో 2వ శతాబ్దం లో జరిగిన కధ కు న్యాయం జరిగేలా లొకేషన్స్ ని సెలెక్ట్ చేసుకొన్నాము.
కన్నప్ప కథ లో అనేక పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు డా. మోహన్ బాబు గారు, మోహన్ లాల్ గారు, హీరో ప్రభాస్ , హీరో అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నేను డా. మోహన్ బాబు కొడుకు అవటం వలన వారందరూ ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకొన్నారు.
హీరో ప్రభాస్ తో మంచి స్నేహం వుంది. ఈ సినిమా కి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించారు.
ఇప్పుడు చూపించిన గ్లింప్స్ చూసిన సినిమా పెద్దలు – ఈ సినిమా ని ప్రపంచానికి చూపెట్టు – అని సలహా ఇచ్చారు.
హీరో మంచు విష్ణు అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ అందరికీ ఓపిగ్గా ఫోటో తీసుకొనే వికాసం ఇచ్చారు.