కన్నప్ప వెయిట్ చేయక తప్పదు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. డిసెంబర్ అని అప్పట్లో అన్నారు కానీ అందులో డేట్ పేర్కొనలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు రెండు అంశాల మీద డిపెండ్ అయి ఉంది. మొదటిది పుష్ప2 రిలీజ్ డిసెంబర్ 6 నుంచి తప్పుకుంటే దాన్ని లాక్ చేసుకోవడం.
కానీ సుకుమార్ టీమ్ ఆ ఛాన్స్ ఇచ్చేలా లేదు. ఇంకొంత భాగం షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి నవంబర్ రెండో వారానికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక రెండో అంశం గేమ్ ఛేంజర్. ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ అని పదే పదే చెప్తున్నారు కానీ డేట్ ను మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు.
గేమ్ ఛేంజర్, పుష్ప2 వీటిలో ఏ సినిమాతో తలపడినా కన్నప్పకు రిస్కే. ఎంత స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కన్నప్ప సోలోగా విష్ణు భుజాల మీద నడవాల్సిన సినిమా. గెస్ట్ రోల్స్ చేశారని ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్లలేరు. పైగా అదే టైమ్ కు ముఫాసా లయన్ కింగ్, విడుదల2, బేబీ జాన్ రేసులో ఉన్నాయి. కాబట్టి కన్నప్పకు వెయిట్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. సెప్టెంబర్ అయిపోయింది సో దసరా ఛాన్స్ లేదు. డిసెంబర్ విషయం క్లారిటీ రావాలి. పోనీ సంక్రాంతికి వద్దామనుకుంటే చాలా కాంపిటీషన్ ఉంది.













