డిసెంబర్ పై కన్నేసిన కన్నప్ప
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని విష్ణు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాడు. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని స్వయంగా విష్ణు తన ట్విట్టర్ లో అనౌన్స్ చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. దానికి కారణం పుష్ప2 సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజవడం. కన్నప్ప డిసెంబర్ లో వస్తుందని విష్ణు చెప్పగానే మరోసారి పుష్ప2 వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నాఉ. ఒకవేళ పుష్ప2 డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చినా సలార్ లాగా డిసెంబర్ మూడో వారంలో కన్నప్పను రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ సాధించాలనేది విష్ణు ప్లాన్ అయుండొచ్చు.
అయితే డిసెంబర్ మూడో వారానికి చైతూ తండేల్, నితిన్ రాబిన్ హుడ్ రేసులో ఉన్నాయి. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారే ఛాన్సుంది. మొత్తానికి ఐదు నెలల ముందే డిసెంబర్ రేస్ ఎంతో రసవత్తరంగా మారుతుంది. బాలయ్య- బాబ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా డిసెంబర్ వైపే చూస్తోంది. మరి వీటిలో ఏయే సినిమాలు డిసెంబర్ లో రిలీజవుతాయో చూడాలి.













