కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ కన్నుమూత
కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి, అలనాటి హీరోయిన్ సుమలత భర్త అంబరీష్ కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ మరియు శ్వాసకోశ వ్యాదితో బాధపడుతున్న అంబరీష్ రాత్రి బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 66 ఏళ్ల అంబరీష్ దక్షిణ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి ప్రస్తుతం కన్నడ సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచారు.
మైసూర్ రాష్ట్రం మాండ్య జిల్లాలో జన్మించిన అంబరీష్ అసలు పేరు గౌడ అమర్ నాథ్. 1972లో ‘నాగరాహవు’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 200 పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1991లో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన తెలుగు మహిళ సుమలతను వివాహం చేసుకోవడం వల్ల తెలుగు వారి అల్లుడిగా అంబరీష్ మారిపోయారు. సినిమ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించి కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే.













