‘దియా’ ప్రీ రిలీజ్ వేడుక
దీక్షిత్‌శెట్టి, పృథ్వీ, ఖుషి నాయకానాయికలుగా నటించిన కన్నడ చిత్రం దియా. ఈ సినిమాను నిర్మాతలు ఆర్కే నల్లం, రవికశ్యప్ తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. కె.ఎస్. అశోక దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగంది. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది. ఓ యువతి జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరబ్బాయిలు, వారి ప్రేమప్రయాణం ఏ తీరాలకు చేరిందనేది హృద్యంగా ఉంటుంది. కన్నడంలో విజయవంతంమైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అని తెలిపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని హీరోయిన్ ఖుషి చెప్పింది. మూడు హృదయాల సంఘర్షణ హృద్యంగా ఆవిష్కరించే చిత్రమిదని గేయరచయిత పూర్ణాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీ, నరసింహా తదితరులు పాల్గొన్నారు.













