కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్… 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త విని శాండల్‌వుడ్ సినీ ప్రుముఖులతో పాటు ఇతర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేగాక భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.













