ఆ సినిమాతో కంగువకు కనెక్షన్
టాలీవుడ్ స్థాయిని బాహుబలి(Baahubali) ఏ రేంజ్ లో పెంచిందో కోలీవుడ్ స్థాయిని కంగువ(Kanguva) సినిమా పెంచుతుందని తమిళ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి ఆఖరికి నవంబర్ 14కి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు. సూర్య(Suriya) లాంటి పెద్ద హీరో సినిమా వస్తున్నా వరుణ్ తేజ్(Varun Tej) మట్కా(Matka) లాంటివి పోటీ పడటం చూస్తుంటే కంగువని తక్కువ అంచనా వేస్తున్నారనే డౌట్లు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే దసరా అయిపోగానే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయాలని కంగువ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంగువలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకీ, సూర్య 24(24 Movie)కి కనెక్షన్ ఉంటుందని కోలీవుడ్ టాక్. కథ పరంగా కాదు కానీ పాయింట్ విషయంలో మాత్రం ఒకేలా ఉంటుందని సమాచారం.
వందల ఏళ్ల వెనుక ఉన్న ఓ అడవి యోధుడు వర్తమానంలోకి వచ్చి ఆధునిక టెక్నాలజీ వాడకంలో ఆరితేరిపోయిన ఓ గూఢచారిని కలుసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని డైరెక్టర్ సిరుత్తై శివ టచ్ చేశాడంటున్నారు. 24 సినిమాలో చూపించిన టైమ్ ట్రావెల్ ని కంగువలో ఇంకా విభిన్నంగా వాడుకుని ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కించారంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ(Disha Patani) హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా నటిస్తున్నాడు.













